Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీట్ (NEET) ఎక్షామ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Advertiesment
నీట్ (NEET) ఎక్షామ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:37 IST)
12-09-2021 వ తేది నీట్ (NEET) వ్రాత పరీక్షలలో బాగంగా జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు పలు పరిక్షా కేంద్రాలను తనికీ చేసి భందోబస్తూ అవస్యకతపై అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.   
 
తిరుపతి పరిసర ప్రాంతాలలో సుమారు 21 సెంటర్లలో పరీక్షలు నిర్వహించబడుతుంది. అభ్యర్ధులు ఆయా సెంటర్లలో మధ్యాహ్నం 12:30 గంటలకు హాజరు కావలెను, పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటవరకు నిర్వహించబడును. 
 
RTC బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ లలో పోలీస్ హెల్ప్ లైన్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగింది. నీట్ (NEET) పరీక్ష జరుగు సమయంలో పరీక్షా కేంద్రాల పరిదిలో జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ సెంటర్లు, సెల్ ఫోన్ షాప్ లు మరియు ఎలక్ట్రానిక్స్ సంబదపడిన షాప్స్ మొదలుగునవి ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 5.30 గంటలవరకు మూసివేయబడాలి.
 
నీట్ (NEET) ఎక్షామ్ వ్రాత పరీక్షల బందోబస్తు నిమిత్తం జిల్లా యస్.పి గారి అధ్వర్యంలో డి.యస్.పి లు 03, సి.ఐ లు 10, యస్.ఐ లు 10, ఏ.యస్.ఐ/హెచ్.సి లు 19, పి.సి లు 50, స్పెషల్ పార్టీలు పోలీస్ 80 మంది వీరితో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా  విధి నిర్వహణలో ఉంటారు. అలాగే అదనంగా రక్షక్ మొబైల్స్, బ్లూ కోల్ట్స్ మొత్తం 168 మంది అధికారులు మరియు సిబ్బందితో నీట్ (NEET) వ్రాత పరీక్షల సెంటర్ల వద్ద బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు ఈ సందర్భంగా తెలియజేసారు.
 
ముఖ్య గమనిక:
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందన