Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వి.కె శశికళపై మరో కేసు.. మళ్లీ పార్టీలోకి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ

Advertiesment
VK Sasikala
, బుధవారం, 30 జూన్ 2021 (17:23 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేతను బెదిరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగానికి.. శశికళ మద్దతుదారుల నుంచి చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై విచారించిన విల్లుపురం జిల్లా పోలీసులు శశికళపై పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
 
కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా కొందరు నేతలు, కార్యకర్తల మద్దతును కూడా ఆమె కూడగట్టుకున్నారు. అన్నాడీఎంకేపై కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
 
జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. అయితే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓటమి పాలవడం.. గొడవలతో పార్టీ నాశనమవ్వడాన్ని తాను చూడలేనని శశికళ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు