Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారాకు 10 మంది బలి.. తమిళనాడులో ఘటన

Webdunia
సోమవారం, 15 మే 2023 (11:08 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కల్తీసారా తాగి ఇద్దరు మహిళలు సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. విల్లుపురం జిల్లా మరక్కాణం సమీపంలోని సముద్రతీర గ్రామం ఏక్కియార కుప్పం గ్రామానికి చెందిన 11 మంది శనివారం సాయంత్రం కల్తీసారా తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో పుదుచ్చేరి జిమ్మర్ ఆసుపత్రికి, విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ధరణివేల్ (50), సురేష్ (65), శంకర్ (50), రాజమూర్తి ఆదివారం వేకువజాము మృతి చెందారు. మిగిలిన ఏడుగురు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పుదుచ్చేరి నుంచి ఆక్రమంగా కల్తీసారాను తరలించి విక్రయించారనే ఆరోపణలపై అమరన్ (21) అనే యువకుడు సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఏడుగురికి రూ.50 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మరక్కాణం పోలీస్ స్టేషన్‌, ఎక్సైజ్ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. ఇక చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద వసంత అనే మహిళ. ఆమె అల్లుడు చిన్నతంబి బ్రాందీలో కల్తీసారా కలుపు కొని తాగి మృతి చెందారు. అదేజిల్లాకు చెందిన చిత్తూమూర్‌లో కల్తీసారా తాగి వెన్నియప్పన్, అతని భార్య చంద్ర ప్రాణాలు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments