Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్ల టబ్బులో ముంచేసి.. కన్నకొడుకుల ప్రాణం తీసిన తల్లి

Webdunia
సోమవారం, 15 మే 2023 (10:39 IST)
మాతృదినోత్సవం రోజున దారుణం జరిగింది. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయిన ఓ అమ్మ... అభంశుభం తెలియని తన ఇద్దరు కన్నకొడుకులను నీళ్ల టబ్బులో ముంచేసి చంపేసింది. ఆపై విషం తాగి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రి పాలైంది. హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధి జిల్లెలగూడలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుబ్యాతండాకు చెందిన నేనావత్ శ్రీనివాస్ (34), భారతి(25)కి 2020లో వివాహమైంది. జిల్లెలగూడలో నివాస ముండే వీరికి విక్కీ (18 నెలలు), లక్కీ (8నెలలు) కుమారులు ఉన్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్.. భారతి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. 
 
ఈ క్రమంలో శ్రీనివాస్ తల్లి శనివారం జిల్లెలగూడకు రాగా అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఇదేవిషయమై ఆదివారం ఉదయం జిల్లెలగూడ వచ్చిన భారతి తల్లిదండ్రులు కూతురికి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. అనంతరం శ్రీనివాస్ కూడా బయటికి వెళ్లగా... భారతి తన ఇద్దరు కొడుకులని ఓ నీళ్ల టబ్బులో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 
 
అనంతరం తానూ విషం తాగింది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ పిల్లలను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న భారతి పరిస్థితి సైతం విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments