Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పది నెలల కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య

Advertiesment
suicide
, సోమవారం, 15 మే 2023 (09:34 IST)
అదనపు కట్నం కోసం అత్తింటివారు చేస్తున్న వేధింపులు తాళలేకపోయిన ఓ వివాహిత తన పది నెలల వయస్సున్న కన్నకూతురితో కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రాంనగర్ బాకారంలో నివాసముంటున్న విజయ వసంతకుమారి, విద్యాసాగర్‌ అనే దంపతులకు పది నెలల కుమార్తె విద్యాధరణి అనే కుమార్తె ఉంది. విద్యాసాగర్ ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి కాగా పెళ్లి అయిన నాటి నుంచి తల్లి, సోదరితో కలిసి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 13న ఉదయం భార్యాబిడ్డలను ఇంట్లోనే ఉంచిన విద్యాం సాగర్.. తల్లిని తీసుకుని అక్క ఇంటికి వెళ్లాడు. విద్యాసాగర్ శనివారం అర్థరాత్రి తిరిగి ఇంటికి రాగా వసంత కుమారి తలుపు తీయలేదు. చుట్టు పక్కల వారి సహకారంతో తలుపులు తెరిచి చూడగా వసంతకుమారి, విద్యాధరణి విగతజీవులై కనిపించారు. 
 
తల్లీకూతుళ్లు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, అదనపు కట్నం కోసమే తన కూతురు, మనుమరాలిని విద్యాసాగర్ హత్య చేశాడని వసంతకుమారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ మ్యాప్స్ ప్రకారం బైకును నడిపాడు.. ప్రాణాలు కోల్పోయిన టెక్కీ