Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్ మ్యాప్స్ ప్రకారం బైకును నడిపాడు.. ప్రాణాలు కోల్పోయిన టెక్కీ

Advertiesment
road accident
, సోమవారం, 15 మే 2023 (09:31 IST)
హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెకీ దుర్మరణం పాలయ్యాడు. గూగుల్ మ్యాప్స్ ఫాలో అవతూ వెళ్లిన అతడు తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లు గుర్తించి వెనక్కి మళ్లిన సమయంలో మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబర్ 84 వద్ద శనివారం అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టెకీ చరణ్ (22) మృతి చెందాడు. వాహనం వెనక కూర్చున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో అతడు తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం బైకులపై షికారుకు బయల్దేరాడు. తొలుత నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూశాక వారు ట్యాంక్‌బండ్‌పై సేద తీరారు. ఆ తరువాత గూగుల్‌ మ్యాప్స్ సాయంతో మెహిదీపట్నం నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు బయలుదేరారు.
 
గూగుల్ మ్యాప్స్ ప్రకారం బైకును నడిపాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబర్ 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు దిగేందుకు మలుపు తిరిగాడు. ఈ క్రమంలోనే ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టెక్కీ ఆదివారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించవచ్చు..