Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో బీజేపీలోకి సౌరవ్‌ గంగూలీ!

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (09:07 IST)
నిన్నటి వరకు క్రికెట్ లో ప్రత్యర్థులను హడలెత్తించిన బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ.. ఇక రాజకీయాల్లో తన సత్తా చాటనున్నాడా?.. ఇందులో భాగంగా ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నాడా?... అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గంగూలియే సారధ్యం వహించేలా ఒప్పందం కూడా జరిగినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

అందుకోసమే తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్‌కు కేటాయించిన రెండెకరాల స్థలాన్ని వాపస్‌ ఇస్తున్నట్టు ఇటీవల సీఎం మమతా బెనర్జీని కలుసుకున్న గంగూలీ చెప్పాడట.

గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్‌ కోల్‌కతాలో ఓ పాఠశాల నెలకొల్పాలనుకుంది. అందుకు ఈశాన్య కోల్‌కతాలోని అతి ఖరీదైన న్యూటౌన్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు రెండెకరాలు కేటాయించింది. అయితే ఆ స్థలం న్యాయవివాదంలో చిక్కుకోవడంతో గంగూలీ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

స్థలం వివాదంలో ఉండడంతో సౌరవ్‌ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఎడ్యుకేషనల్‌, వెల్ఫేర్‌ సొసైటీ దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేస్తున్నట్టు లేఖ రాసింది. ఆ లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments