భారత రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తుందదని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మండిపడ్డారు.
గోవా, మధ్యప్రదేశ్, మణిపూర్, ఇవాళ రాజస్థాన్ రాజకీయ కుట్రలకు తెర లేపిందని, రాజస్థాన్ గవర్నర్ ఢిల్లీకి దాసోహం అయ్యారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నేతల డైరెక్షన్‌లో రాజస్థాన్‌లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్నీ కాపాడాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉందన్నారు. రాజ్యాంగంలో ఉన్న 10వ షెడ్యూల్‌ను కాపాడుకుందామని సేవ్ డెమోక్రసీ, సేవ్ కానిస్టూషన్ నినాదంతో ముందుకు వెళతామని మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.