గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా పటేదార్ నాయకుడు హార్ధిక్ పటేల్ ఎన్నికయ్యారు. హార్దిక్ పటేల్‌ను గుజరాత్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షులు ఆమోదించారు.
26 ఏళ్ల హార్దిక్ పటేల్ 2015లో పటేదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటంలో ప్రఖ్యాతిని పొందారు. 2019, మార్చి 12వ తేదీన పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అతనిపై ఉన్న కేసు కారణంగా ఆ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
గుజరాత్ కాంగ్రెస్ కమిటీకి అమిత్ చద్వా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా, ఇప్పటికే తుషార్ చౌదరి, కర్సాన్‌దాస్ సోనేరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు.