Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు : కిషన్ - స్మృతిలకు చోటు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (13:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై ద‌ృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రధాని మోడీ నేతృ‌త్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్‌‌కు చోటు కల్పించారు. అలాగే, ప్రధాని నేతృత్వంలోని ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌‌మెంట్ కేబినెట్ కమిటీలో అశ్విన్ వైష్ణవ్, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, కిషన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.
 
ఇకపోతే, పెట్టుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీలో మోడీ, అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌‌లకు స్థానం దక్కింది. 
 
అలాగే, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌‌కు స్థానం కల్పించారు. ఇక కీలకమైన కేబినెట్ సెక్యూరిటీ కమిటీలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments