దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. నిన్న 17,40,325 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,443 మందికి పాజిటివ్‌గా తేలింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు క్షీణించాయి.
అయితే గత 24 గంటల వ్యవధిలో 2020 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా 1,000లోపు నమోదవుతోన్న మరణాల సంఖ్యలో.. భారీ పెరుగుదల చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.09 కోట్లకు చేరగా..4,10,784 మంది మహమ్మారికి బలయ్యారు.
నిన్న ఒక్కరోజే 49,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీలు 3 కోట్ల మార్కును దాటాయి. రికవరీ రేటు 97.28 శాతానికి పెరగ్గా.. క్రియాశీల రేటు 1.40 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 4,32,778 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.