Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశ బిల్లు ఆమోదించండి... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జ‌గ‌న్ లేఖ

దిశ బిల్లు ఆమోదించండి... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జ‌గ‌న్ లేఖ
, శనివారం, 3 జులై 2021 (12:30 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌లు పోలీస్ స్టేష‌న్ కు వెళ్ళాల్సిన ప‌రిస్థితులు రాకుండా చూడాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. ‘దిశ కింద తీసుకుంటున్న చర్యలు, అమలుపై సీఎం తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో సమీక్ష నిర్వ‌హించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాల‌ని, ఫిర్యాదు చేయడానికి, కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాల‌ని సూచించారు. దిశ బిల్లు ఆమోదించాల‌ని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు.
 
దిశ యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్లపైనా మహిళా పోలీసులకు పూర్తిస్థాయి అవగాహన, శిక్షణ కల్పించాల‌ని సీఎం డీజీపీని ఆదేశించారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీలు సమావేశమై ప్రజా సమస్యలతోపాటు, మహిళల భద్రతపైనా సమీక్ష చేయాల‌న్నారు.  మహిళలపై నేరాలకు సంబంధించిన 18 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని, మ‌రోసారి హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తితో దీనిపై మాట్లాడాలన్నారు.  బాలలపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 
 
‘‘దిశ’’కు మరింత బలం:
‘దిశ’’ కాల్ సెంటర్లో అదనపు సిబ్బందికి సీఎం జ‌గ‌న్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టం చేశారు. దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 స్కార్పియోల కొనుగోలుకు సీఎం ఆమోదం తెలిపారు. విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు వీటితోపాటు ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన పోలీస్‌స్టేషన్లకు ఈ వాహనాలు పంపుతారు. రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్‌స్టేషన్ల నిర్మానానికి సీఎం అంగీకారం తెలిపారు.

‘‘దిశ’’కింద నమోదవుతున్న కేసుల పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోరెన్సిక్‌ ల్యాబుల్లో ఇప్పటికే 58 పోస్టులు భర్తీ. మరో 61 మందిని నియమించడానికి సీఎం అంగీకారం తెలిపారు. వీటితోపాటు తిరుపతి, వైజాగ్‌ల్లో (సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌)ల్యాబ్‌ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతపురం, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడల్లో మూడేళ్ల కాలంలో స్పెషల్‌ అసిస్టెన్స్‌ కింద దిశ ల్యాబుల నిర్మాణం చేయాల‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ నాన్నను మీరే చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నా.. పిల్లలతో తల్లి