ఆంధ్రపదేశ్ ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని.. మనం కేంద్రాన్ని అడగడం తప్పా.. ఇంక చేయగలిగినది ఏం లేదని జగన్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపామని.. ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా గాని ఇంకా ఏమన్నా చేయాలంటే చేయవచ్చు.. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది.. సంకీర్ణ ప్రభుత్వం అయి ఉంటే ఆలోచించవచ్చు కానీ పూర్తి మెజారిటీ ఉన్నాగానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మిన్నకుండిపోతోందని అన్నారు.
తాను కేంద్రాన్ని అడుగుతున్నా అని సీఎం జగన్ చెప్పారు కాని.. కేంద్ర ఏం చెపుతోంది అన్నదారిపై సీఎం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవ్వడం కుదరదనో.. లేక ఇప్పటిలో ఇచ్చే పరిస్థితి లేదని.. కాదు అంటే ప్రత్యామ్నాయం గురించో ఏదో ఒకటి సమాధానం చెప్పే ఉంటారు. కానీ సీఎం జగన్ మాత్రం కేంద్రం ఏం చెబుతోంది అన్న విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.