Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూలో సడలింపులు.. సాయంత్రం 6 వరకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూలో సడలింపులు.. సాయంత్రం 6 వరకు..
, శుక్రవారం, 18 జూన్ 2021 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో వున్న కర్ఫ్యూలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, సాయంత్రం 6 గంటలకు అనేక సండలింపులు ఇవ్వాలని భావిస్తోంది. 
 
శుక్రవారం కొవిడ్‌పై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ సండలింపులు జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
 
సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ ఖచ్చితంగా అమలవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు వర్తించనుంది. 
 
కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్‌ టైమింగ్స్‌ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్‌బీ పరిచయం... అవకాశం కల్పిస్తానని అత్యాచారం.. ఎక్కడ?