Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు కాదు.. ఏడు పేపర్లే

Advertiesment
జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు కాదు.. ఏడు పేపర్లే
, గురువారం, 17 జూన్ 2021 (13:19 IST)
కరోనాతో వాయిదా పడుతూ వచ్చిన పది, ఇంటర్ తరగతి పరీక్షలు ఏపీలో జరుగనున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. జూలై 26 నుంచి ఆగష్టు 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా కేంద్రాల్లో 6.28 లక్షల మంది విద్యార్ధులు ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారు.
 
కరోనా, లాక్‌డౌన్ కారణంగా వారిపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఈ ఏడాది 11 పేపర్లకు బదులు 7 పేపర్లకే పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు వెల్లడించారు. సామాన్య శాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులు 100 మార్కులకు.. భౌతిక, రసాయన శాస్త్రం పేపర్‌ 1గా, జీవశాస్త్రం పేపర్ 2గా 50 మార్కుల చొప్పున నిర్వహిస్తామని అన్నారు. 
 
కాగా, జూలై 7 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కూడా పలు ప్రతిపాదనలు సూచించింది. ఇవాళ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తుండటంతో.. ఆయన పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంలో CBSE 12th ఫలితాల వెల్లడి.. ఎలా లెక్కిస్తారంటే..?