విద్యార్థిని బ్యాంకు ఖాతాలోకి రూ.900 కోట్లు జమ.. ఎలా?

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:24 IST)
కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లోని కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దీంతో కొందరి ఖాతాల్లో భారీ నగదు జమ అవుతుంది. మరికొందరి ఖాతాల్లోని డబ్బు ఖాళీ అవుతుంటుంది. తాజాగా ఓ విద్యార్థి ఖాతాలోకి ఏకంగా 900 కోట్ల రూపాయలు జమ అయింది. ఈ మొత్తాన్ని చూసిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యాయరు. ఇది బీహార్ రాష్ట్రంలోని కటిహార్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు స్కూలు యూనిఫాం తదితర వస్తువులు కొనుక్కోవడం కోసం ఒక ప్రభుత్వ స్కీంకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా వారి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమయ్యాయి. 
 
ఆ డబ్బు తమ ఖాతాలో చేరిందా? అని ఇంటర్నెట్‌లో చెక్ చేస్తే ఒక విద్యార్థి ఖాతాలో రూ.6.2 కోట్లు జమ అయినట్లు కనిపించింది. మరో విద్యార్థి ఖాతాలో ఏకంగా రూ.900 కోట్లు జమైనట్లు తెలిసింది.
 
ఈ విషయం తెలిసిన బ్యాంకు మేనేజర్ ఘటనపై స్పందించారు. బ్యాంకు సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని ఆయన చెప్పారు. నిజానికి సదరు విద్యార్థుల ఖాతాల్లో డబ్బు లేదని, కానీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో మాత్రం అంత సొమ్ము ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు.
 
కాగా, పట్నా పరిసరాల్లో నివసించే ఒక వ్యక్తి ఖాతాలో ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షలు జమయ్యాయి. ఇవి తనకు మోదీ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు అని భావించిన అతను ఆ మొత్తాన్ని ఖర్చుపెట్టేశాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments