Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అకౌంట్ చెక్ చేస్తే కోట్లు కనిపించాయ్.. ఆమె ఖాతాలోకి 74 వేల కోట్లు.. ఎలా..?

అకౌంట్ చెక్ చేస్తే కోట్లు కనిపించాయ్..  ఆమె ఖాతాలోకి 74 వేల కోట్లు.. ఎలా..?
, బుధవారం, 23 జూన్ 2021 (19:10 IST)
Billion
అకౌంట్ చెక్ చేస్తే వందల్లో కాకుండా కోట్లలో బ్యాలెన్స్ వుందని చూపిస్తే ఎలా వుంటుంది. ఎగిరి గంతేస్తాం కదూ.. సరిగ్గా ఇటువంటి సంఘటనే ఫ్లోరిడాలో ఓ మహిళకు జరిగింది. ఆమె 20 డాలర్లు డ్రా చేద్దామని ఏటిఎంకు వెళితే.. అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేవని.. ఒకవేళ డ్రా చేసినా.. అది ఓవర్‌డ్రాప్ట్‌ కిందకు వస్తుందని మెసేజ్‌ వచ్చింది.
 
అయినా ఆమె పర్లేదులే అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. దీంతో ఆమె అసలు తన బ్యాంక్‌ అకౌంట్‌లో ఎంత అమౌంట్‌ ఉంది అని చెక్‌ చేయగా.. ఏకంగా అకౌంట్‌లో బిలియన్‌ డాలర్లు (74,26,19,00,000 రూపాయలు) అంటే అక్షరాలా 74 వేల కోట్లు ఉన్నట్లు చూపింది. 
 
ఇంకేముంది ఆమెకు గుండె ఆగినంత పనైంది. అసలు తన అకౌంట్‌లో ఉన్న డబ్బులు నిజమా కాదా అని తెలుసుకోవడానికి సదరు మహిళ బ్యాంక్‌కి వెళ్లి ఆరా తీయగా.. అది కాస్తా... నెగిటివ్‌ బిలియన్‌ డాలర్ల సొమ్మని బ్యాంకు అధికారులు తెలిపారు. 
 
అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్‌ను లాక్‌ చేసినప్పుడు ఇలా కనిపిస్తుందనీ.. మోసాలను నివారించడానికే ఈ పద్ధతిని ఉపయోగిస్తారని ఆమెకు తెలిపారు. దీని ఫలితంగా.. సదరు మహిళ తాను డ్రా చేయదలచుకున్న 20 డాలర్లను కూడా డ్రా చేయలేకపోయిందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన పిల్లలకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ఉద్దేశం : సీఎం జగన్