Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై పదిమంది గ్యాంగ్ రేప్.. ఇద్దరు మైనర్లు కూడా.. హింసించి.. 15గంటలు?

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మైనర్లతో పాటు పదిమంది దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్, జశ్‌పూర్ జిల్లా, హట్కాలా గ్రామానికి చెందిన మహిళ తన స్నే

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (15:08 IST)
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మైనర్లతో పాటు పదిమంది దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గడ్, జశ్‌పూర్ జిల్లా, హట్కాలా గ్రామానికి చెందిన మహిళ తన స్నేహితుడితో కలిసి కైకాచ్చార్‌ గ్రామం నుంచి అటవీ మార్గంలో వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు వారిని అడ్డగించారు. మహిళపై చెయ్యేసారు. 
 
కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు మహిళ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ కామాంధులు ఐదుగురు బాధితురాలి వెంటాడి తీవ్రంగా కొట్టి హింసించారు. ఆపై ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వదిలిపెట్టి నిందితులు పరారైనారు. పది మంది చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలు 15 గంటల పాటు అడవిలోనే వుండిపోయింది. 
 
స్పృహ రావడంతో ఎలాగోలా నడుచుకుంటూ ఇంటికొచ్చి, తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నితేష్‌(22), లియాండర్‌ బెక్‌(25), రోస్టిన్‌(22), సచిన్‌(19), సంగీత్‌(26), అసిత్‌ బెక్‌(29), అమిత్‌ బెక్‌(25), అమ్రిత్‌ కుజూర్‌(23) అనే వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు వున్నారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించగా, మిగిలిన ఎనిమిది మందిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం