కూరగాయలు సరిగ్గా తరగడం రాదా.. అంతే అత్తపై కోడలు..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:50 IST)
చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకు గురయ్యే వారు నేరాలకు పాల్పడుతున్నారు. హంతకులుగా మారుతున్నారు. తాజాగా కూరగాయలు సరిగ్గా కోయమంటూ దుర్భాషలాడిన అత్తపై కోడలు కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన 62 ఏళ్ల మోహినీ దేవికి, తన కోడలు మమతా దేవితో ఒక్క క్షణం పడేది కాదు. 
 
గత సోమవారం మమత కూరలు తరుగుతూ ఉంటే మోహిని అక్కడకు వచ్చి.. `కూరగాయలు సరిగా కోయడం రాదా..` అంటూ దుర్భాషలాడింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన మమత కూరగాయలు కోసే కత్తితో అత్తపై దాడి చేసింది.
 
అత్త శరీరంపై 26 చోట్ల కత్తితో గాయాలు చేసింది. అనంతరం తన లగేజీ తీసుకుని ఇంటి నుంచి పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మమతను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments