ఓ ఐఏఎస్ ఆఫీసర్.. కూరగాయలు అమ్మాడు. ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి.. కూరగాయలు అమ్మాల్సిన అవసరం ఆయనకేంది.. అంటారా? పదండి.. ఓసారి యూపీకి వెళ్లి వద్దాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా. ఆ రాష్ట్ర రవాణా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన కూరగాయలు అమ్ముతున్న ఫోటో ఒకటి ఇపుడు సోషలో మీడియాలో వైరల్ అయింది.
తన ఫేస్‌బుక్ వాల్‌లో ఆ ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఫోటోలో రోడ్డు పక్కన కూరగాయల కొట్టు దగ్గర కింద కూర్చొని అఖిలేష్ కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు అది నిజమా? లేక ఫేకా? అని కామెంట్లు చేశారు.
చివరకు ఆ ఫోటో గురించి అఖిలేష్ మిశ్రానే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఫోటోలో ఉన్నది తానేనని.. అక్కడ కూరగాయలు అమ్మింది కూడా నిజమేనని.. తాను ప్రయాగ్‌రాజ్‌కు ఆఫీసు పని మీద వెళ్లినప్పుడు.. అక్కడ మార్కెట్‌లో ఆగి కూరగాయలు కొన్నానని చెప్పాడు.
అయితే.. కూరగాయలు అమ్మే ఓ మహిళ కాసేపు తన కూరగాయల బండి దగ్గర కూర్చోవాలని అఖిలేష్‌ను అడగడంతో.. కాదనలేక.. కాసేపు అక్కడ కూర్చున్నాడట. అదేసమయంలో కస్టమర్లు రావడంతో.. వాళ్లకు కూరగాయలు అమ్మాడట. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో చెప్పుకొచ్చాడు.