Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్టు ధిక్కార కేసులో హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్‌లు

కోర్టు ధిక్కార కేసులో హైకోర్టుకు హాజరైన నలుగురు ఐఏఎస్‌లు
, సోమవారం, 9 ఆగస్టు 2021 (15:10 IST)
కోర్టు ధిక్కార నేరం కింద ఎపి హైకోర్టుకు నలుగురు ఐఎఎస్ అధికారులు హాజరయ్యారు. వారిలో పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీ లక్ష్మి, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు.
 
పాఠశాలల భవనాలలో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయం నిర్మాణం పై హై కోర్టులో దిక్కర  కేసు విచారణ జరుగుతోంది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం  వ్యాఖ్యానించింది.
 
పేద పిల్లలు చదువుకునే స్కూల్‌లో వాతావరణం కలుషితం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకున్నారా అని హైకోర్టు జడ్జి దేవానంద్ అధికారులను ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా నిర్మాణాలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు న్యాయమూర్తి.
 
పాఠశాల ఆవరణ లోకి రాజకీయాలు తీసుకెళ్తారా అని హై కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసారు. ఆగస్టు 31న కూడా అధికారులంతా హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నివేదిక ఇస్తామని ఏజీ కోర్టుకు విన్నవించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది మృత్యువాత