Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తపై శిల్పా శెట్టి సంచలన ప్రకటన.. ఎప్పుడూ ఫిర్యాదు చేయను... ఎవరికీ వివరించను

Advertiesment
భర్తపై శిల్పా శెట్టి సంచలన ప్రకటన.. ఎప్పుడూ ఫిర్యాదు చేయను... ఎవరికీ వివరించను
, సోమవారం, 2 ఆగస్టు 2021 (14:06 IST)
ప్రముఖ వ్యాపారవేత్త రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ కో- ఓనర్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చిత్రీకరణ ఆరోపణలపై అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సాక్ష్యాలన్నీ శిల్పాశెట్టి భర్తకు వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే శిల్పాశెట్టి మాత్రం తన మౌనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ కేసు ప్రభావం ఆమెపై భారీగా పడింది. 
 
శిల్పాశెట్టికి తన భర్త చేసే పనులపై పూర్తి అవగాహన లేకపోవడం కొసమెరుపు. ఇక కొద్ది రోజుల నుండి మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియాలోని ప్రజలు శిల్పాశెట్టి పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ ప్రధాన తారాగణంలో ఒకరైన శిల్పాశెట్టి భర్త ఇలా చేయడం ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా శిల్పా శెట్టి ట్విట్టర్ వేదికగా వీరందరికీ తన సమాధానాన్ని వెల్లడించారు.
 
శిల్పాశెట్టి ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. గడిచిన కొద్ది రోజులు తనకు చాలా కష్ట కాలమని తనపై ఎన్నో రూమర్లు, ఆరోపణలు వచ్చాయని ఆమె అన్నారు. తనని ట్రోల్ చేస్తూ తన పై ప్రశ్నలు సంధిస్తూ తన ఫ్యామిలీపై వచ్చిన ఆరోపణలన్నీ మీడియా ప్రతినిధులు, తన మేలుకోరని వారందరూ కురిపించారు అని చెప్పింది. అయితే ఇప్పటివరకు తన భర్త పై వచ్చిన ఆరోపణల పై తానేమీ స్పందించలేదని... ఇకపై కొద్దిరోజులు ఈ విషయంపై తన దగ్గర నుండి ఎలాంటి స్పందన కూడా ఉండదని ఖచ్చితత్వం వ్యక్తం చేశారు.
 
ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న తను "ఎప్పుడూ ఫిర్యాదు చేయను... ఎవరికీ వివరించను' అనే సూత్రాన్ని పాటిస్తానని తెలిపారు శిల్పా. ఇప్పటివరకు అయితే తాను ఈ కేసు విషయమై ఎలాంటి ఆరోపణలు కానీ స్టేట్మెంట్లు కానీ ఇవ్వలేదని కాబట్టి తన పేరు మీద వచ్చిన స్టేట్మెంట్లు అన్ని తప్పు అని వివరించారు. "ఇది జరుగుతున్న విచారణ... నాకు ముంబై పోలీసు వారిపై, భారత న్యాయ సంస్థల పై పూర్తి విశ్వాసం ఉంది. ఇక చట్టబద్ధంగా తాము సహకరించవలసిన ప్రతి విధానానికి మేము సంసిద్ధంగా ఉంటాము,' అని తెలిపారు.
 
ఇక ఒక తల్లి స్థానంలో శిల్పా శెట్టి అందరికీ చేస్తున్న విన్నపంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ గోప్యతను గౌరవించాల్సిందిగా... తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎటువంటి అనఫిషీయల్ వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చట్టాన్ని గౌరవించే భారత పౌరురాలిగా కష్టపడి పనిచేసే ప్రొఫెషనల్‌గా తాను ఈ దేశం గురించి ఎంతో గర్వపడుతున్నానని... అలాగే ప్రజలు కూడా తనను ఎంతో నమ్మారని.. ఇప్పటివరకు తనను నమ్మిన వారిని ఎవరిని తాను మోసం చేయలేదు... అలాగే తక్కువ చేయలేదని చెప్పారు. ఈ కష్టకాలంలో తన కుటుంబ గౌరవాన్ని, గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పిన ఆమె. ఈ కేసు విషయంలో మాత్రం చట్టం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలని శిల్పాశెట్టి తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌ర‌క‌టూరులో రోడ్డు ప్ర‌మాదం; క‌లెక్ట‌ర్ మ‌న‌వ‌తాదృక్ఫ‌థం