కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ తన మానవతా దృక్ఫథాన్ని చాటారు. పెడన నియోజవర్గం గూడూరు - మచిలీపట్నం 216 జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
అదే మార్గంలో వెళుతున్న కలెక్టర్ జె.నివాస్ వెంటనే స్పందించారు. అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కారు దిగి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి మానవత్వం చాటారు. ఈ మార్గంలో ఒక కారు ద్విచక్ర వాహనదారులయిన ఇద్దరిని డీకొంది. యాక్టివా, బైక్లను కారు ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
మృతుడు మచిలీపట్నానికి ఇంగ్లీష్‌పాలెంకి ప్రాంతానికి చెందిన అబ్దుల్ వుల్ఫాస్‌గా గుర్తించించారు. మృతదేహాన్ని 108లో పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం పోలీసులు తరలించారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ జె నివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.