టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్‌లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టును 1-0 తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా సెమీస్‌లో అడుగుపెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత హాకీ జట్టు సెమీస్ చేరుకుంది.
ఈ క్రీడల్లో పతకం సాధించాలనే పట్టుదలతో మైదానమంతా పాదరసంగా కదులుతూ జట్టు సభ్యులు కంగారులను కంగారెత్తించారు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్ -2020లో ఆదివారం భారతదేశానికి చారిత్రాత్మక రోజు. పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారత పురుషుల హాకీ జట్టు కూడా 49 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే, 1972 తర్వాత తొలిసారిగా భారత జట్టు ఒలింపిక్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.