Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి బారాత్‌లో విషాదం.. ట్రక్కు దూసుకెళ్లి 13 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:35 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపుపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 13 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదం వివరాలు ఇలావున్నాయి. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌ఘర్ - జైపూర్ జాతీయ రహదారిపై ఓ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఈ ఊరేపింగింపులో నిమగ్నమైవున్న వారిపైకి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
 
అలాగే, వధువు కూడా తీవ్రంగా గాయపడింది. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments