Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పింగ్లన్‌లో ఎన్‌కౌంటర్ : మేజర్ సహా నలుగురు సైనికుల మృతి

పింగ్లన్‌లో ఎన్‌కౌంటర్ : మేజర్ సహా నలుగురు సైనికుల మృతి
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:18 IST)
పూల్వామా ఉగ్రదాడి నుంచి తేరుకోక ముందే జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు తీవ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా పింగ్లన్ ప్రాంతంలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లను జైషే మహ్మద్ ఉగ్రవాదులు కాల్చి చంపారు.
 
ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్ సహా మొత్తం నలుగురు సైనికులు మృతిచెందారు. గురువారం నాడు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన స్థలానికి మరో 10 కిమీ దూరంలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
 
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు లేక ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు తలదాచుకుని ఉండి ఉంటారని భావిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి జల్లెడ పడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్వామా అమరుడి శవపేటిక వద్ద సెల్ఫీ.. అల్ఫోన్స్ ఏంటిది?