Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరు జ్యోతి అత్యాచారానికి గురికాలేదు... పక్కా ప్లాన్‌తోనే హత్య.. నిందితుడు అతడే...

Advertiesment
Guntur Jyothi Murder Case
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:04 IST)
గుంటూరు జిల్లా అమరావతి టౌన్‍షిప్‌లో ఓ ముళ్లపొదల్లో హత్యకు గురైన జ్యోతి కేసులోని మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. ఆమెపై అత్యాచారం జరగలేదనీ, కానీ పక్కా ప్రణాళికతో హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పైగా, ఈ కేసులో ప్రధాన ముద్దాయి శ్రీనివాస్‌దేనని చెప్పారు.
 
ప్రియురాలు జ్యోతి తనను దూరంగా ఉంచడాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాస్.. పక్కా ప్రణాళికతో హత్య చేసినట్టు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆస్సత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
 
కాగా, గతవారం ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి బైక్‌పై అమరావతి టౌన్ షిప్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడు ఇద్దరు ఉన్న సమయంలో జ్యోతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రియుడిని కొట్టి... జ్యోతిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో ఇప్పటివరకు శ్రీనివాస్ స్నేహితులు శశి, పవన్ అనే ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
వీరిద్దరూ హత్యకు వారం రోజుల ముందు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. అమరావతి టౌన్‌షిప్ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం.. అక్కడ జనసంచారం పెద్దగా లేకపోవడంతో జ్యోతిని అక్కడకు తీసుకురావాలని శ్రీనివాస్‌కు వీరే చెప్పారని పోలీసులు భావిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతోనే జ్యోతిని వదిలించుకునేందుకు శ్రీనివాసే హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే కాన్పులో ఏడుగురు... ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి