Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాలెంటైన్స్ డే స్పెషల్.. గ్రీటింగ్ కార్డ్స్..?

వాలెంటైన్స్ డే స్పెషల్.. గ్రీటింగ్ కార్డ్స్..?
, గురువారం, 14 ఫిబ్రవరి 2019 (14:18 IST)
ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేంది. అది ఈ రోజే.. (ఫిబ్రవరి 14). ఈ రోజు ప్రేమికులకు చాలా ముఖ్యమైన రోజు. ప్రేమికులు వాలెంటైన్స్ డేని ఓ పెద్ద పండుగగా జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో ఈ రోజు సెలవు కూడా ఇస్తారు. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో.. వాలెంటైన్స్ డే కార్డులు పంపడం, పువ్వులు ఇవ్వడం, చాక్లెట్స్ వంటివి ఇస్తారు. 
 
వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే ప్రేమికులు ఒకరికొకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వాలెంటైన్స్ రూపంలో ప్రేమ సందేశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ రోజుకు మరింత అనుబంధం ఉంది. 19వ శతాబ్దం నుండి.. చేతితో రాసిన సందేశాలు ఇచ్చే సంప్రదాయం భారీ స్థాయిలో గ్రీటింగ్ కార్డ్‌ల తయారీకి మార్గం చూపింది. అప్పటినుండే.. ప్రేమికులు ఇరువురు వాలెంటైన్ కార్డులు ఇచ్చుకుంటారు.
 
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు అమెరికా గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా వేసింది. సంవత్సరంలో క్రిస్మస్ తరువాత కార్డులు ఎక్కువగా పంపబడే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది. అంతేకాకుండా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ రోజున మహిళల కంటే పురుషులు సగటున రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సంఘం అంచనా వేసింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేలంటైన్స్ డే ఆఫర్ : మీ మాజీ లవర్ ఫోటో తగలబెడితే..