Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ తరపున రాజ్యసభకు రఘురాం రాజన్!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (14:15 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను ఆప్ నేతలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలనుకాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్‌ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. సెంట్రల్‌ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 
 
రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ కొనసాగేందుకు మొగ్గు చూపినప్పటికీ కేంద్రం మాత్రం అందుకు సమ్మతించలేదు. దీంతో తనకు ఇష్టమైన అధ్యాయపక వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోటాలో ఖాళీ కాబోతున్న ఈ మూడు రాజ్యసభ సీట్లలో ఒకదానికి రఘురాం రాజన్ పేరును కేజ్రీవాల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments