Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవికి టీడీపీ, వైకాపా ఆఫర్లే ఆఫర్లు.. కాంగ్రెస్‌కు హ్యాండిస్తారా? రాజకీయాలకు బై చెప్తారా?

తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో కా

Advertiesment
చిరంజీవికి టీడీపీ, వైకాపా ఆఫర్లే ఆఫర్లు.. కాంగ్రెస్‌కు హ్యాండిస్తారా? రాజకీయాలకు బై చెప్తారా?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:51 IST)
తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అంత క్రేజ్ లేకపోవడంతో పాటు ఆ పార్టీ రాజకీయ భవితవ్యం చెప్పుకునే స్థాయిలో లేకపోవడంతో చిరంజీవి.. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చేందుకు రెడీ అయినట్లు టాక్ వస్తోంది.
 
వచ్చే ఏడాదితో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వానికి కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలతో బిజీ బిజీగా వున్నారు. మరోవైపు చిరంజీవి రాజ‌కీయాల‌కు పూర్తిగా వీడ్కోలు ప‌లుకుతారని కూడా చర్చ సాగుతోంది. అంతేగాకుండా కాంగ్రెస్ నుంచి చిరంజీవి పక్కకు తప్పుకుంటారని.. వివిధ పార్టీల నుంచి ఆయనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. 
 
చిరంజీవిని మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తామ‌ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా ఈ ఆఫ‌ర్లు ఇస్తున్న పార్టీల్లో టీడీపీ, వైసీపీ పార్టీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక మొత్తం మీద చూసుకుంటే చిరంజీవిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి లేదని సమాచారం. దీంతో చిరంజీవి ఆ పార్టీని వీడి తెలుగుదేశం లేదా వైకాపాలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ హలోలో మరో హీరోయిన్.. నివేదిత సతీష్ ఎవరు?