Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్, రామ్ చరణ్‌తో 'మగధీర 2' చేయాలని వుంది... విజయేంద్ర ప్రసాద్

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజలతో మగధీర 2 చిత్రం రూపొందించాలని వుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అవకాశం కుదిరితే మగధీర 2 కథ రాస్తాననీ, దానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే చాలా సంతోషిస్తానని చెప్పారు. ఇది నిజమే అయితే మాత్రం మెగా ఫ్యాన్

మెగాస్టార్, రామ్ చరణ్‌తో 'మగధీర 2' చేయాలని వుంది... విజయేంద్ర ప్రసాద్
, బుధవారం, 13 సెప్టెంబరు 2017 (19:17 IST)
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజలతో మగధీర 2 చిత్రం రూపొందించాలని వుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అవకాశం కుదిరితే మగధీర 2 కథ రాస్తాననీ, దానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తే చాలా సంతోషిస్తానని చెప్పారు. ఇది నిజమే అయితే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు పండగే మరి.
 
ఇకపోతే బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం శ్రీవల్లి అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు... ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లకు రానుంది.
 
ఈ సినిమాపై విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఆలోచనలకు.. మానసిక విశ్లేషణకు అనుగుణంగా ఈ కథ వుంటుందని చెప్పారు. వైజాగ్‌లో తనకు రమేష్ అనే మిత్రుడుండే వాడని.. అతడు 2010లో వినాయక చతుర్థి  ముందు రోజే చనిపోయాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
తనకోసం ఎంతో కాలం వేచి చూసిన ఆయన.. చివరి క్షణాల్లో తనను తలచుకున్నాడని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తన మిత్రుడిని చూడాలనుకున్నా.. వైజాగ్‌కు ఆతడు చనిపోయిన రెండేళ్లకు తర్వాత వెళ్లి.. షాక్ అయ్యానన్నారు. 2010లో వినాయక చవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని అన్నారు. మనసు రమేష్ వైపే లాగిందని, అయితే అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్‌లోని అతనింటికి వెళ్తే.. అంతలో అతడు కన్నుమూశాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ బాధలో నుంచి శ్రీవల్లి కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
 
ఇక బాహుబలి దర్శకుడు, తనయుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భావించే మహాభారతం గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకుముందు తానెక్కడా చెప్పలేదన్నారు. కానీ ప్రస్తుతానికి చెప్పేదేమిటంటే.. జక్కన్న తప్పకుండా మహాభారతం తీసే అవకాశం ఉందని తెలిపారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చునని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాలిని అలాంటిదా...? ఆశ్చర్యపోతున్న సినీపరిశ్రమ...!