Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్ల రద్దుతో నిండా మునిగిన ఆర్బీఐ... నల్లధనానికి వడ్డీ చెల్లిస్తున్న వైనం

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో భారతీయ రిజర్వు బ్యాంకు తీవ్రంగా నష్టపోయింది. ఈ నోట్ల రద్దు వల్ల ఆర్బీఐకు గానీ, కేంద్ర ఆర్థిక శాఖకు గానీ ఒక్క శాతం కూడా లాభం చేకూరలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertiesment
నోట్ల రద్దుతో నిండా మునిగిన ఆర్బీఐ... నల్లధనానికి వడ్డీ చెల్లిస్తున్న వైనం
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:52 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో భారతీయ రిజర్వు బ్యాంకు తీవ్రంగా నష్టపోయింది. ఈ నోట్ల రద్దు వల్ల ఆర్బీఐకు గానీ, కేంద్ర ఆర్థిక శాఖకు గానీ ఒక్క శాతం కూడా లాభం చేకూరలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇదే అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందిస్తూ, నోట్ల ర‌ద్దు వ‌ల్ల న‌ష్ట‌మే త‌ప్ప లాభం లేద‌ని మొద‌టి నుంచీ ఆయ‌న వాదిస్తూనే వచ్చానని తెలిపారు. తాను చెప్పిన‌ట్లే 99 శాతం ర‌ద్ద‌యిన నోట్లు ఆర్బీఐకి తిరిగి వ‌చ్చాయి. దీనివ‌ల్ల రిజ‌ర్వ్ బ్యాంక్‌కు తీవ్ర న‌ష్టం వాటిల్ల‌నున్న‌ట్లు రాజ‌న్ చెప్పారు. ఊహించ‌నిదాని కంటే ఎక్కువ నోట్లు తిరిగి రావ‌డం వ‌ల్ల ఇప్పుడు ఆర్బీఐకి వేల కోట్ల వ‌డ్డీల అద‌న‌పు భారం ప‌డింద‌ని ఆయ‌న అన్నారు. 
 
ఈ మొత్తం ఏడాదికి రూ.24 వేల కోట్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని రాజ‌న్ అంచ‌నా వేశారు. నోట్ల ర‌ద్దుకు ముందు వ‌ర‌కు ఏదైతే న‌ల్ల‌ధ‌నం అని చెప్పారో.. అది ఆయా వ్య‌క్తుల ఇళ్ల‌లో మూలుగుతుండేది. దీనికి ఎలాంటి వ‌డ్డీ వచ్చేది కాదు. బ్యాంకులు కూడా చెల్లించేవి కాదు. అయితే ఎప్పుడైతే అది వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చిందో అదే వ్య‌క్తులు దానికి వ‌డ్డీ ఆర్జిస్తున్నారు. ఈ విష‌యాన్ని చాలా మంది గుర్తించ‌లేదు అని రాజ‌న్ చెప్పారు. 
 
నోట్ల ర‌ద్దుతో క‌నీసం రూ.3 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం వ్య‌వ‌స్థ నుంచి వెళ్లిపోతుంద‌ని ప్ర‌భుత్వం భావించిందనీ, అయితే ఆ ధ‌నాన్ని క‌లిగిన వ్య‌క్తులు మాత్రం ఎలాగోలా దాన్ని మ‌ళ్లీ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి చేర్చ‌గ‌లిగారని చెప్పారు. దీనివ‌ల్ల ఆ మొత్తానికి కూడా ఇప్పుడు ఆర్బీఐ వ‌డ్డీ చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని రాజ‌న్ చెప్పుకొచ్చారు. అందుకే ఈ ఏడాది ఆర్బీఐ లాభాలు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయ‌ని ఆయ‌న చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో పాకిస్థాన్ బ్యాంక్ మూసివేత