Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారువేషంలో హనీప్రీత్... ఖాట్మండులో కనిపించిందట...

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ మారు వేషంలో సంచరిస్తోందట. ఈనెల ఒకటో తేదీన నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈమె కనిపించినట్టు సమాచారం. ఇద్దరు స్వాధ్వీల అత్యాచారం కేసు

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:44 IST)
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ మారు వేషంలో సంచరిస్తోందట. ఈనెల ఒకటో తేదీన నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈమె కనిపించినట్టు సమాచారం. ఇద్దరు స్వాధ్వీల అత్యాచారం కేసులో డేరా బాబాకు 20 యేళ్ళ జైలుశిక్ష పడిన తర్వాత ఆయనను దేశందాటించేందుకు హనీప్రీత్ ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆమెపై దేశద్రోహం కేసుతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం ఆరోపణలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
కానీ, డేరా బాబాను జైలుకు తరలించిన తర్వాత హనీప్రీత్ కనిపించకుండా పోయారు. ఆమె ఆచూకీ కోసం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు విభాగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుపై హర్యానా ప్రభుత్వం వేసిన సిట్ విభాగం రాజస్థాన్‌ లో డేరా బాబా సన్నిహితుడైన ప్రదీప్ గోయల్‌‌‌ను అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించింది. దీంతో హనీప్రీత్ గుట్టువీడింది. ఆమె నేపాల్‌కు పారిపోయిందని తేలింది. 
 
దీంతో వారు నేపాల్‌లోని తమ సోర్స్‌తో కనెక్ట్ అయి, ఆమె ఫోటోలు పంపారు. వెంటనే రంగంలోకి దిగిన సోర్స్.. ఆమె ఆచూకీని గుర్తించినట్టు తేలింది. సెప్టెంబర్ 2న నేపాల్ రాజధాని ఖాట్మాండూలో హనీప్రీత్ కనిపించిందని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారంతా ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది.
 
అయితే, తన కోసం పోలీసులు, నిఘా వర్గాలు గాలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న హనీప్రీత్... తన గెటప్‌ను పూర్తిగా మార్చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ప్రయాణాలను గతంలోలా లగ్జరీ వాహనాల ద్వారా కాకుండా సాధారణ, ప్రైవేటు ట్యాక్సీలలో చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments