Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia

హనీ ప్రీత్‌కు ప్రాణముప్పు? డేరా బాబా బిగ్ బాస్ షో.. హనీకి నో రూల్స్.. ఆమె భర్త కూడా?

డేరా బాబా దత్త పుత్రిక హనీ ప్రీత్ సింగ్ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో హర్యానా సర్కారు అప్రమత్తమైంది. గత నెల 25న జైలులో ఉన్న గుర్మీత్‌ను కలిసేందుకు ఆమె వచ్చింది.

Advertiesment
హనీ ప్రీత్‌కు ప్రాణముప్పు? డేరా బాబా బిగ్ బాస్ షో.. హనీకి నో రూల్స్.. ఆమె భర్త కూడా?
, శనివారం, 9 సెప్టెంబరు 2017 (12:56 IST)
డేరా బాబా దత్త పుత్రిక హనీ ప్రీత్ సింగ్ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో హర్యానా సర్కారు అప్రమత్తమైంది. గత నెల 25న జైలులో ఉన్న గుర్మీత్‌ను కలిసేందుకు ఆమె వచ్చింది. అయితే జైలు అధికారులు ఆమెను అనుమతించకపోవడంతో డేరా బాబా అనుచరులు ఆమెను వాహనంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో గుర్మీత్ అసాంఘిక కార్యకలాపాలకు ప్రత్యక్ష సాక్షిగా వున్న ఆమెను చంపేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో హనీప్రీత్ కోసం గాలింపు చర్యలు జరుపుతున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. కానీ ఆమెను అరెస్ట్ చేసి.. రహస్య విచారణ జరుపుతున్నామనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు.
 
మరోవైపు డేరా బాబా అభిరుచుల్లో 'బిగ్ బాస్ షో' కూడా ఉందని ఆయన మాజీ భక్తుడు గురుదాస్ తూర్ వెల్లడించారు. నెల రోజుల పాటు బిగ్ బాష్ షోను కూడా బాబా నిర్వహించాడని చెప్పారు. ఈ షోలో భాగంగా డేరా బాబా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్లాలి.. ఎవరు నిష్క్రమించాలనే వివరాలన్నీ గుర్మీత్ ఆదేశాల ప్రకారమే జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం అద్భుతమైన భవనం నిర్మించాడని.. ఆ ఇంట్లో సీసీటీవీలను పలు కోణాల్లో ఫిక్స్ చేసేవాడని చెప్పారు. 
 
హనీ ప్రీత్ ఇన్సాన్, ఆమె మాజీ భర్త గుప్తా కూడా ఈ రియాలిటీ షో కంటెస్టెంట్సేనని చెప్పుకొచ్చారు. ఈ షో హోస్ట్, జడ్జి గుర్మీతేనని, పార్టిసిపెంట్స్‌ అందరికీ రూల్స్ వుండేవని.. అయితే హనీ ప్రీత్‌కు మాత్రం ఆ రూల్స్ వుండేవి కాదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాలో ఘోరం.. మాంసం కోసం యువతిని వివస్త్ర చేసి.. శరీర భాగాలను?