Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భక్తి ముసుగులో నిలువు దోపిడీ.. బొప్పాయి రూ.5 వేలు... బీన్స్ విత్తనాల ప్యాకెట్ రూ.లక్ష

ఇద్దరు సాధ్వీల రేప్ కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సిర్సాలోని ఆయన ఆశ్రమంలో పోలీసులు జరిపిన సోదాల్లో అనేక దిగ్భ్ర

Advertiesment
భక్తి ముసుగులో నిలువు దోపిడీ.. బొప్పాయి రూ.5 వేలు... బీన్స్ విత్తనాల ప్యాకెట్ రూ.లక్ష
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (15:23 IST)
ఇద్దరు సాధ్వీల రేప్ కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సిర్సాలోని ఆయన ఆశ్రమంలో పోలీసులు జరిపిన సోదాల్లో అనేక దిగ్భ్రాంతికర విషయాలు బహిర్గతమైన విషయం తెల్సిందే. తాజాగా డేరా బాబాకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పండే కూరగాయలను కొనాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిందే. భక్తి ముసుగులో భక్తులను నిలువుదోపిడీ చేశాడు. 
 
సిర్సాలో సుమారు 700 ఎకరాల్లో డేరా బాబాకు వ్యవసాయ భూములున్నాయి. వీటిలో వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. వీటిని బాబా సొంత మార్కెట్‌‌లో భక్తులకు విక్రయిస్తాడు. ఈ కూరగాయలు మహిమాన్వితమైనవిగా బాబా పేర్కొంటాడు. వాటికి తనకు ఇష్టం వచ్చిన రేటు నిర్ణయిస్తాడు. ఈ ధరలు ప్రపంచంలో ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. తనకు అత్యంత సన్నిహిత భక్తులకు ఒక్కో బొప్పాయిని 5 వేల రూపాయలకు విక్రయిస్తాడు.
 
అలాగే అతని చేతుల మీదుగా టమోటాలు కొనుగోలు చేయాలంటే ఒక్కో టమోటాకు రూ.1000 చొప్పున చెల్లించాల్సిందే. అలాగే, ఒక్క ఎర్ర మిరపకాయ (పండు మిర్చి) ధర 1,000 రూపాయలు, చిన్న వంకాయ ధర రూ.1,000 చొప్పున డబ్బులు ఇవ్వాలి. వంకాయి సైజు పెరిగితే వెయ్యి పెరిగినట్టే. చిక్కుడు గింజలు (బీన్స్)ని ప్యాక్ చేసి అమ్ముతారు. అరకిలో చిక్కుడు గింజల ప్యాక్ లక్షల రూపాయలు. నాలుగు చిక్కుడు గింజలు 1,000 రూపాయలు. 
 
తన తోటలో పండిన కూరగాయలు కొనితింటే ఎలాంటి రోగాలు రావని భక్తులను నమ్మించాడు. ఫలితంగా భక్తులు వాటికి ఎంత రేటు నిర్ణయించినా గుడ్డిగా నమ్మి కొనుగోలు చేశారు. కొందరు భక్తులు బాబా పొలంలో పండిన మహిమాన్విత కూరగాయలు దొరికితే తమ జన్మధన్యమైనట్టేనని భావించారనీ, అందుకే బాబా నిర్ణయించిన రేటుకు కూరగాయలను కొనుగోలు చేసి నిలువునా మోసపోయినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 ఏళ్ల బాలికపై 40 మంది గ్యాంగ్ రేప్.. రాత్రిపూట మత్తుమందిచ్చి..?