Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డేరాబాబాకు దిక్కులేదు.. ఒక్కరూ రాలేదు.. తీవ్ర ఒత్తిడిలో గుర్మీత్.. చేసిన పాపాలకు?

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడు జైలుకొచ్చి 15 రోజులు గడిచినా అతనిని చూసేందుకు ఆయన కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. గుర్మీత్ సింగ్‌ను కలిసేందుకు అతని కుమారుడు జస్మిత్, అత

డేరాబాబాకు దిక్కులేదు.. ఒక్కరూ రాలేదు.. తీవ్ర ఒత్తిడిలో గుర్మీత్.. చేసిన పాపాలకు?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (16:46 IST)
రేపిస్ట్ గుర్మీత్ సింగ్ రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడు జైలుకొచ్చి 15 రోజులు గడిచినా అతనిని చూసేందుకు ఆయన కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. గుర్మీత్ సింగ్‌ను కలిసేందుకు అతని కుమారుడు జస్మిత్, అతని దత్తపుత్రిక హనీప్రీత్‌ సింగ్‌లకు అనుమతి వుందని అయితే... హనీ ప్రీత్ సింగ్ ఎక్కడో కనుమరుగైందని.. అలాగే గుర్మీత్ కుటుంబీకులు ఎవ్వరూ ఆయన్ని చూసేందుకు జైలువరకు రాలేదని జైలు అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతానికి డేరా బాబా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, ఇప్పటికే రెండుసార్లు వైద్య బృందం అతడిని  పరిశీలించిందని జైలు అధికారులు తెలిపారు. గుర్మీత్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనో సెక్స్ అడిక్ట్ అని తేలిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే.. గుర్మీత్ సింగ్ డేరా స్కూలులోని పది మంది మైనర్ బాలికలపై లైంగికంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. గత నెలలో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబాకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 
 
వీరితో పాటు మరో పదిమంది మహిళలతో పాటు చిన్నారులపై కూడా బాబా లైంగిక దాడి చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సీబీఐ ఇప్పటికే ఛార్జీషీటు దాఖలు చేసింది. రామ్ రహీమ్ ఇసాన్ ఆరుగురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారు చెప్పారు. డేరా బాబా చేతిలో నలిగిపోయిన బాధితులు డేరా ఆశ్రమం నుంచి పారిపోయినా అతను పట్టుబడటంతో అతని పాపాల చిట్టాను మీడియాతో వెల్లగక్కుతున్నారు.
 
వీరిలో ఓ బాబా బాధితురాలు వివాహం చేసుకుని దుబాయ్‌కెళ్లింది. ఆమెకు వివాహం కూడా అయ్యింది. తన ఐదేళ్ల వయస్సున బాబా చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పింది. ఇంకా డేరా ఆశ్రమంలోని వైద్య శాలలో ఎక్కువ గర్భస్రావాలు జరిగేవని ఆమె తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమెకి ఇద్దరు... ఆమె కోసం వాళ్లు కొట్టుకుంటున్నారు... ఏం చేద్దాం?