Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.10 కోట్ల వ్యయంతో బోన్స్ బ్యాంక్ ... డేరా బాబా రూ.25 లక్షల విరాళం

సిర్సాలోని డేరా సచ్చా సౌధా ఆశ్రమంలో ఎముకల బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆ ఆశ్రమ చీప్ గుర్మీత్ రాం రహీం సింగ్ భావించాడు. ఇందుకోసం రూ.10 కోట్లను వెచ్చించాలని ప్లాన్ వేసి, పలు స్వచ్చంధ సంస్థల నుంచి భారీ మొత్

Advertiesment
రూ.10 కోట్ల వ్యయంతో బోన్స్ బ్యాంక్ ... డేరా బాబా రూ.25 లక్షల విరాళం
, బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:57 IST)
సిర్సాలోని డేరా సచ్చా సౌధా ఆశ్రమంలో ఎముకల బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆ ఆశ్రమ చీప్ గుర్మీత్ రాం రహీం సింగ్ భావించాడు. ఇందుకోసం రూ.10 కోట్లను వెచ్చించాలని ప్లాన్ వేసి, పలు స్వచ్చంధ సంస్థల నుంచి భారీ మొత్తంలో విరాళాలు కూడా సేకరించాడు. 
 
ఆశ్రమంలోని ఉంటున్న సాధ్వీలలో ఇద్దరిపై ఆయన అత్యాచారం జరిపిన కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. దీంతో డేరా బాబా ప్రస్తుతం రోహ్‌తక్ జైలులో జీవితం గడుపుతున్నాడు. 
 
ప్రస్తుతం డేరా ఆశ్రమంలో షాహ్ సత్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఉంది. దీనికి అనుబంధంగా బోన్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రాథమిక పనులను ఈ యేడాది ప్రారంభంలోనే మొదలు పెట్టాడు. ఇందుకోసం కొన్ని యంత్రాలను కూడా కొనుగోలు చేశాడు. 
 
ఈ నేపధ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి రూ. 25 నుంచి 50 లక్షల వరకూ విరాళాలు సేకరించాడు. డేరా బాబా తన ఎంఎస్‌జీ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.25 లక్షలు బోన్స్ బ్యాంకు కోసం విరాళంగా ప్రకటించాడు కూడా. అయితే, రేప్ కేసులో తుది తీర్పు వెలువడటం డేరా బాబా జైలుకెళ్లడంతో డేరా ఆశ్రమమే లేకుండా పోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్దాన ప్రజల కిడ్నీ సమస్యకు తాగునీరు కారణం కాదు