Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేరా బాబా లగ్జరీ లైఫ్.. బంగారు సింహాసనాలు, ఖరీదైన డోర్లు, వాల్ కర్టెన్స్ (వీడియో)

డేరా బాబా ఆశ్రమం పేరిట విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. సాధ్విలను వాడుకున్నాడు. భక్తులను భక్తి ముసుగులో మోసం చేశాడు. ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్నాడు. ప్రస్తుతం అతని ఆశ్రమంలో పోలీసులు తనిఖీలు చేస

Advertiesment
డేరా బాబా లగ్జరీ లైఫ్.. బంగారు సింహాసనాలు, ఖరీదైన డోర్లు, వాల్ కర్టెన్స్ (వీడియో)
, శనివారం, 9 సెప్టెంబరు 2017 (13:22 IST)
డేరా బాబా ఆశ్రమం పేరిట విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. సాధ్విలను వాడుకున్నాడు. భక్తులను భక్తి ముసుగులో మోసం చేశాడు. ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్నాడు. ప్రస్తుతం అతని ఆశ్రమంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా బంగారు పూతతో కూడిన వస్తువులు అతని గదిలో చూసి పోలీసులు ఖంగుతిన్నారు. 
 
డేరా బాబా ఆశ్రమంలో తనిఖీల కోసం అడుగుపెట్టిన భద్రతా బలగాలు అక్కడ అతని వైభవం చూసి షాక్ అయ్యారు. బంగారు సింహాసనాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే టేబుళ్లు, బంగారు అంచులతో తయారైన టైనింగ్ టేబుల్, భోజన సామగ్రి, బంగారు పూతతో కూడిన సీలింగ్ వంటివి చూసి షాక్ అయ్యారు. వీటితో పాటు అత్యంత ఖరీదైన డోర్లు, వాల్ కర్టెన్స్ చూసి షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాగా డేరా బాబా ముసుగులో భారీ అక్రమాలకు పాల్పడిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భారీ ఎత్తున ఆస్తులు సొంతం చేసుకున్నాడు. తానే స్వయంగా పండించానని, వాటిని తింటే అనారోగ్యం దరిచేరదని చెబుతూ ఒక వంకాయ వెయ్యి రూపాయలు, టమాటా వెయ్యి రూపాయలు, అరకిలో బీన్స్ లక్ష రూపాయలు.. ఇలా భారీ ఎత్తున రేట్లు నిర్ణయించి వసూళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ డబ్బే కాదు.. వివిధ రూపాల్లో భక్తులను మోసం చేసిన డేరా బాబా భారీ నగదు కూడగొట్టుకున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా గాంధీని నమ్ముకుని బిచ్చగాడుగా మారాడు... ఎక్కడ?