Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేరా బాబా గోడలతో మాట్లాడుతున్నాడు.. కారణం శృంగారానికి?

డేరా బాబా ఆశ్రమంలో సోదాలు ముగిసినట్లు పౌరసంబంధాల శాఖ హర్యానా డిప్యూటీ డైరెక్టర్‌ సతీశ్‌ మెహ్రా తెలిపారు. ఈ నెల 8న ప్రారంభమైన ఈ సోదాలు.. ఆదివారం ముగిసినట్లు సతీశ్ మెహ్రా వెల్లడించారు. గుర్మీత్ సింగ్ సన

Advertiesment
డేరా బాబా గోడలతో మాట్లాడుతున్నాడు.. కారణం శృంగారానికి?
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:00 IST)
డేరా బాబా ఆశ్రమంలో సోదాలు ముగిసినట్లు పౌరసంబంధాల శాఖ హర్యానా డిప్యూటీ డైరెక్టర్‌ సతీశ్‌ మెహ్రా తెలిపారు. ఈ నెల 8న ప్రారంభమైన ఈ సోదాలు.. ఆదివారం ముగిసినట్లు సతీశ్ మెహ్రా వెల్లడించారు. గుర్మీత్ సింగ్ సన్నిహితురాలు హనీప్రీత్ కోసం పోలీసులు గాలింపు మొదలెట్టారు. హనీప్రీత్ దేశాన్ని విడిచి నేపాల్‌కు పారిపోయిందన్న వార్తల నేపథ్యంలో దేశ సరిహద్దు వెంబడి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫోటోను అతికించారు. 
 
ఇప్పటికే ఆమెపై లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. కాగా.. దళితులు గుర్మీత్‌ రామ్‌ రహీం వంటి బాబాలకు మద్దతు తెలపవద్దని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే కోరారు. బీఆర్‌ అంబేద్కర్‌ సిద్ధాంతాలను ఆచరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా దొంగ బాబాల వెనక వెళ్లవద్దన్నారు. ఇప్పటికే 14 మంది దొంగ బాబాలను అరెస్ట్ చేశారు.  
 
ఇకపోతే.. డేరా బాబా శృంగార వ్యసనపరుడని వైద్య పరీక్షల్లో తేలింది. జైలులో డేరాబాబు గోడలతో మాట్లాడుతున్నాడని, సరిగ్గా భోజనం చేయలేదని జైలు అధికారులు తెలిపారు. ఇందుకు కారణం ఇన్నాళ్ల పాటు అనుభవించిన సుఖమయమైన జీవితానికి ఆయన దూరం కావడమేనని వైద్యులు తెలిపారు. 
 
అయితే.. రెగ్యులర్‌గా అనుభవిస్తున్న శృంగార జీవితానికి ఒక్కసారిగా దూరం కావడంతోనే ఈ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయని శనివారం డేరాబాబాను పరీక్షించిన వైద్య బృందం తేల్చింది. ఆయనకు చికిత్స చేయడంలో ఆలస్యం జరిగితే సమస్య మరింత పెరుగుతుందని సదరు వైద్యులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వైన్‌ ఫ్లూ వైరస్‌కు వరంగల్ ఏసీపీ మృతి