Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేరా బాబాకు అమ్మాయిల్ని విషకన్యలే సప్లై చేస్తారు.. అరిచినా.. గోల చేసినా వాళ్లదే బాధ్యత..?

డేరా బాబా లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆశ్రమంలో తాను కోరుకున్న అమ్మాయిని అనుభవించేందుకు ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు గుర్మీత్ సింగ్. తనకు కావాల్సిన అమ్మాయిని ఒప్పించే విధంగా విషకన్యలు అనే గ్

Advertiesment
Girls
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (14:56 IST)
డేరా బాబా లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆశ్రమంలో తాను కోరుకున్న అమ్మాయిని అనుభవించేందుకు ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు గుర్మీత్ సింగ్. తనకు కావాల్సిన అమ్మాయిని ఒప్పించే విధంగా విషకన్యలు అనే గ్రూప్‌ ఉండేదట. ఈ బృందంలోని మహిళలు డేరాలోని అందమైన యువతులను ఎంపిక చేసి.. వారిని ఒప్పించి డేరాబాబా వద్దకు పంపేవారట. ఆ యువతులు డేరా బాబా వద్ద ఎదురు తిరగకుండా వారిని మైండ్ వాష్ చేసి పంపేవారట. ఈ విషకన్యలు గుర్మీత్‌ సింగ్‌‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. వీరంతా గతంలో సాధ్వీలుగా డేరాలో ఉన్నవారే. 
 
వీరు యువతులకు మాయమాటలు చెప్పి బాబా ఆశీర్వాదంతో పవిత్రులై పోతారంటూ నమ్మబలికే వారట. యువతులు ఎవరైనా ఎదురు తిరిగితే వారికి 24 గంటల పాటు నీరు, ఆహారం ఇవ్వరు. కుర్చీల్లో కట్టేసి కొట్టటంతో పాటు కోపంగా చూసే యువతుల ముఖంపై మసిపూసి గాడిదలపై ఊరేగించే వారట. డేరా బాబా వద్ద అరిచి గోల చేసినా విషకన్యలే వారి సంగతి చూసుకునేవారట. ఈ విషయాలను గుర్మీత్‌కు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన గురుదాస్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్, అమ్మాయిలను తన గదికి పిలిపించుకుని అత్యాచారాలు చేయడం ఆయన నిత్యకృత్యాల్లో ఒకటని తెలుస్తోంది. ఇక గుర్మీత్ పిలుస్తున్నాడన్న పిలుపు వస్తే, డేరాలో ఉన్న ఏ అమ్మాయైనా తప్పకుండా వెళ్ళాల్సిందే. అయితే ఓ అమ్మాయి మాత్రం డేరా బాబా నుంచి ఓ అబద్ధం చెప్పి తప్పించుకునేదట. డేరా బాబా వల్ల తనకు ఏర్పడిన అనుభవాన్ని ఓ యువతి బయటపెట్టింది. తనకు నెలసరి వచ్చిందని చెప్పిన ఆమె, తెలివిగా గుర్మీత్ బారిన పడకుండా తప్పించుకుంది.
 
గుఫా అంటూ తనకు తొలిసారి పిలుపు వచ్చిందని, గుర్మీత్ గదిలోకి వెళ్లిన తరువాతే ఆయన చేసే పనేంటన్నది తనకు అర్థమై పోయిందని చెప్పింది. గుర్మీత్  సింగ్ మంచంపై కూర్చుని పోర్న్ వీడియో చూస్తున్నాడని తెలిపింది. ఆపై తనను వచ్చి పక్కన కూర్చోవాలని ఆదేశించాడని, అప్పుడు తాను పీరియడ్స్‌లో ఉన్నానని, మీకు ఎదురుగా రాలేనని చెప్పి తప్పించుకున్నానని వెల్లడించింది. ఇదే ఐడియాను చాలామందికి చెప్పి వారిని తప్పించుకునేలా చేశానని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ పార్కులో అత్యాచారం: బస్టాండ్‌‍లో దించుతానని క్యాబ్ డ్రైవర్ కారులో ఎక్కించుకుని..?