డేరా ఆస్పత్రిలో రోగుల ఆపరేషన్ల కంటే అబార్షన్లే ఎక్కువ..
వివాదాస్పద రాసలీలల గురువు డేరా బాబా అలియాస్ గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో బాలికలతో పాటు.. కన్య స్త్రీలను గర్భవతులను చేసి, వారికి అబార్షన్లు చేయడం సర్వసాధారణమైన విషయమని డేరా మాజీ సభ్యుడు ఒకరు చెపుతున్నాడు. ఇ
వివాదాస్పద రాసలీలల గురువు డేరా బాబా అలియాస్ గుర్మీత్ సింగ్ ఆశ్రమంలో బాలికలతో పాటు.. కన్య స్త్రీలను గర్భవతులను చేసి, వారికి అబార్షన్లు చేయడం సర్వసాధారణమైన విషయమని డేరా మాజీ సభ్యుడు ఒకరు చెపుతున్నాడు. ఇద్దరు సాధ్వీల అత్యాచారం కేసులో డేరా బాబా జైలుకెళ్లడంతో డేరాలో జరిగిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. సాధ్వీలపైనే కాదు.. అన్నెంపున్నెం ఎరుగని స్కూల్ చిన్నారులపైనా గుర్మీత్ రాంరహీం సింగ్ దాష్టీకాలకు పాల్పడ్డారని డేరాలో ఇదివరకు పనిచేసిన గురుదాస్ సింగ్ టూడ్ అనే సభ్యుడు వెల్లడించాడు. తనపట్ల బాబా పాల్పడిన దారుణాలను తల్లిండ్రులకు చెప్పుకున్నా వారు నమ్మలేదని, దీనికి కారణం డేరా బాబాపై వారు పెట్టుకున్న మూఢ నమ్మకమేనని చెప్పాడు.
డేరా ఆస్పత్రిలో రోగులకు చికిత్సకన్నా బాలికల గర్భస్రావాలే ఎక్కువ జరిగేవని టూడ్ చెప్పాడు. డేరా సభ్యుడిగా స్వయంగా మూడు అబార్షన్లు జరగడాన్ని చూశానన్నాడు. చిన్నారులపై బాబా చేసిన దాష్టీకాలపై కోర్టులో కేసులో వేస్తానని ఆయన చెప్పాడు.
డేరా పాఠశాలలో 10 మంది బాలికలను రాంరహీం లైంగికంగా వేధించారన్నాడు. బాధితులంతా తనకు తెలుసని.. వారిలో చాలామందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయన్నాడు. వారిలో చాలామందితో రాంరహీం టచ్‌లో ఉండేవారని చెప్పుకొచ్చాడు.