Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమెకి ఇద్దరు... ఆమె కోసం వాళ్లు కొట్టుకుంటున్నారు... ఏం చేద్దాం?

ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ఒకే స్త్రీ ఇద్దరు వ్యక్తులను... అంటే ఒకరు భర్త, ఇంకొకరు ప్రియుడిగా దగ్గరై భర్తయినవాడు... వివరాలను చూస్తే... బీహారు రాష్ట్రంలోని గొరౌలీ ప్రాంతానికి చెందిన కంచన్ కుమారి, ధర్మేంద్ర దాస్ ను వివాహం చేసుకుంది.

Advertiesment
ఆమెకి ఇద్దరు... ఆమె కోసం వాళ్లు కొట్టుకుంటున్నారు... ఏం చేద్దాం?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (15:12 IST)
ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ఒకే స్త్రీ ఇద్దరు వ్యక్తులను... అంటే ఒకరు భర్త, ఇంకొకరు ప్రియుడిగా దగ్గరై భర్తయినవాడు... వివరాలను చూస్తే... బీహారు రాష్ట్రంలోని గొరౌలీ ప్రాంతానికి చెందిన కంచన్ కుమారి, ధర్మేంద్ర దాస్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఐతే పెళ్లికి ముందే అనిల్ అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి తర్వాత ధర్మేంద్రను వదిలిపెట్టి నేరుగా ప్రియుడు దగ్గరకు వెళ్లిపోయింది. అంతేకాదు... అతడిని వివాహం చేసేసుకుంది. 
 
ఐతే కనిపించకుండా పోయిన భార్య కోసం ధర్మేంద్ర చాలాచోట్ల వెతికాడు కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఈమధ్య అనుకోకుండా భార్య మరో వ్యక్తితో కలిసి ధర్మేంద్ర కంటపడింది. అంతే... వెంటనే ఆమె చేయి పట్టుకుని ఇంటికి వెల్దాం పదా అంటూ గద్దాయించాడు. ఈ పరిణామంతో పక్కనే వున్న అనిల్, అతడిపై చేయి చేసుకున్నాడు. 
 
ఆమె నా భార్య... ఎవడ్రా నువ్వూ అంటూ మండిపడ్డాడు. నువ్వెవడిరా.. ఆమె నా భార్య అంటూ ఇతను కూడా తిరగబడ్డాడు. దీనితో వ్యవహారం పోలీసు స్టేషనుకు చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఆ ఇద్దరి భర్తల తల్లిదండ్రులతో పాటు కంచన్ కుమారి తల్లిదండ్రులను కూడా పిలిపించి సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిశ్చయించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేరా బాబాకు అమ్మాయిల్ని విషకన్యలే సప్లై చేస్తారు.. అరిచినా.. గోల చేసినా వాళ్లదే బాధ్యత..?