Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీప్రీత్ సింగ్ ప్రేమలో పడింది.. ఆ ప్రేమికుడు ఎవరు?

డేరా బాబా జైలులో శిక్ష అనుభవిస్తున్న తరుణంలో అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్ సింగ్ డైరీ ప్రస్తుతం దొరికింది. ఈ డైరీ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. డేరా ఆశ్రమం నుంచి వెళ్తూ వెళ్తూ హనీప్రీత్ సింగ్ ఐదువేల

Advertiesment
హనీప్రీత్ సింగ్ ప్రేమలో పడింది.. ఆ ప్రేమికుడు ఎవరు?
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:30 IST)
డేరా బాబా జైలులో శిక్ష అనుభవిస్తున్న తరుణంలో అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్ సింగ్ డైరీ ప్రస్తుతం దొరికింది. ఈ డైరీ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. డేరా ఆశ్రమం నుంచి వెళ్తూ వెళ్తూ హనీప్రీత్ సింగ్ ఐదువేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ని ధ్వంసం చేసింది. ఇంకా గుర్మీత్ అకృత్యాలకు అదనపు సాక్ష్యాలు లేకుండా చేసిన హనీప్రీత్.. తాను పదిలంగా దాచుకున్న డైరీని మాత్రం మరిచిపోవడం.. అది సోదాలు జరుపుతున్న అధికారుల కళ్లపడటం గమనార్హం. 
 
ప్రస్తుతం ఎక్కడుందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నేపాల్ పారిపోయిందని కొందరు, రాజస్థాన్‌లో దాగుందని మరికొందరు భావిస్తున్నారు. చిన్న వయస్సులోనే హనీప్రీత్  ప్రేమలో పడింది. అతనిని దూరం కావడంతో విరహవేదనకు గురైంది. కవితల రూపంలో మనస్సులోని బాధను వ్యక్తం చేసింది. సోదాల్లో హనీప్రీత్ సింగ్ డైరీ దొరికింది. రాత్రవుతోంది. పగలు వస్తోంది. అయితే ఈ నిరీక్షణకు అంతం ఎప్పుడని రాసుకుంది. 
 
ఇంతకీ హనీప్రీత్‌లో ప్రేమను రగిల్చి, ఆమెలో నిద్రలేకుండా చేసింది ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. అతను ఎవరన్నదీ, ఎలా ఉంటాడన్నదీ తెలియకపోయినా, ఈ డైరీలోని ప్రతి అక్షరమూ చూస్తుంటే, హనీప్రీత్ అతన్ని ఎంతగా ప్రేమించిందన్న సంగతి తెలుస్తోంది. 
 
తన చిన్న వయసులో మనసుకు నచ్చిన వాడిని గాఢంగా ప్రేమించి, అది విఫలమైన తరువాత తన మనసు విరిగిపోయిందని.. ఇప్పుడే అనిపిస్తుందని.. నీ పరిచయం కాకుండా ఉంటే బాగుండేదని.. విరహ కవిత్వాన్ని హనీప్రీత్ తన డైరీలో రాసుకుంది. డైరీలోని ప్రతీ లైన్‌లో మనసారా ప్రేమించి.. జీవితం పంచుకోవాలని భావించినవాడి గురించి ప్రస్తావిస్తూనే వుంది. లవ్ అనే మాటకు ఎన్నో నిర్వచనాలు చెప్పుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్త కాళ్లు నరికేసిన కోడలు... ఎందుకు?