Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అంటే రాజకీయ నేతలే కాదు.. : మీడియాకు ప్రధాని క్లాస్

దేశీయ మీడియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. భారత్ అంటే కేవలం రాజకీయ నేతలే కాదు.. 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలంతా ఎదుర్కొంటున్న సమస్యలు, అంశాలపై మీడియా దృష్టిసారించాలని ఆయన

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (14:33 IST)
దేశీయ మీడియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. భారత్ అంటే కేవలం రాజకీయ నేతలే కాదు.. 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలంతా ఎదుర్కొంటున్న సమస్యలు, అంశాలపై మీడియా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
సోమవారం తమిళ దినపత్రిక "దినతంతి" 75వ వార్షికోత్స వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడూ రాజకీయాలేనా.. ఇండియా అంటే రాజకీయ నాయకులే కాదు.. ఇంకా చాలా ఉంది.. ఈ దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.. మీడియా మిగతా అంశాలపైనా దృష్టి సారించాలి.. అంటూ పిలుపునిచ్చారు. 
 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, న్యాయవ్యవస్థలాగే మీడియాకు కూడా ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాంతి ద్వారా తప్ప బలప్రయోగం ద్వారా సంస్కరణలను తీసుకురాకుండా చేయడంలో మీడియాదే ప్రధాన పాత్ర అని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం మీడియా అంతా రాజకీయాల చుట్టే తిరుగుతోందని, భారత్ అంటే రాజకీయ నేతలే కాదు. దాని కంటే చాలా పెద్దది. 125 కోట్ల ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు. మీడియా మిగతా అంశాలపై దృష్టిపెడితే తాను చాలా సంతోషిస్తానని అన్నారు.
 
ప్రజా ప్రయోజనాల కోసమే మీడియా తమ వాక్ స్వాతంత్య్రాన్ని ఉపయోగించాలి. రాసే స్వాతంత్య్రం ఉంది కానీ.. తప్పుడు వార్తలు రాసే స్వాతంత్య్రం మాత్రం లేదన్నారు. ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పులను మీడియా బాగా హైలైట్ చేయాలని మోడీ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు పెరిగిపోతున్నాయి. 
 
వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుందా? వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో మనమేం చేయాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా కృషి చేస్తుందా? అని ప్రధాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రెస్‌ను నాలుగో స్తంభంగా పరిగణిస్తారు. మీడియా ఖచ్చితంగా ఓ శక్తే. అయితే దానిని దుర్వినియోగం చేయకూడదు అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments