రూ.25వేలిచ్చి ప్రియురాలిని సొంతం చేసుకున్నాడు.. భర్త కూడా ఓకే చెప్పాడు.. ఎక్కడ?

పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఇష్టం లేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు యువతి ప్రియుడితో పారిపోయింది. తొలిసారి ప్రియుడి వద్దకు వెళ్ళిపోవడంతో ఆమ

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (14:23 IST)
పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఇష్టం లేని వివాహం జరిపించడంతో కొన్నాళ్లకు యువతి ప్రియుడితో పారిపోయింది. తొలిసారి ప్రియుడి వద్దకు వెళ్ళిపోవడంతో ఆమెను వెతికిపట్టుకున్నారు. అయినా రెండోసారి కూడా పారిపోయింది. చివరికి ప్రియుడితోనే వుంటానని పోలీసులతో చెప్పింది. ప్రియుడు కూడా ఆమెతో వుంటానని చెప్పి అడ్వాన్స్‌గా రూ.25వేలిచ్చి దక్కించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా మనప్పారై ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. బలవంతంగా ఆమెను తల్లిదండ్రులు మేనమామకిచ్చి వివాహం జరిపించారు. అతని నుంచి పారిపోయిన దేవిని పోలీసులు గుర్తించి భర్తకు అప్పగించారు. 
 
అయినా రెండోసారి కూడా ప్రియుడి చెంతకే చేరిపోయింది. చివరికి పోలీసుల పంచాయతీతో దేవి లక్షరూపాయలిస్తే ఆమెను ప్రియుడికి వదిలిపెట్టేస్తానని చెప్పాడు. దీంతో రెండు రోజుల పాటు ముగ్గురికీ కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసుల చర్చలతో వారంతా ఒక అంగీకారానికి వచ్చారు. లక్ష రూపాయలు చెల్లిస్తానని చెప్పి, అడ్వాన్స్‌గా రూ.25,000లను చెల్లించి దేవిని తనతో కాపురానికి ప్రియుడు తీసుకెళ్లడంతో వివాదం సమసిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments