Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ... ఒకడి చేతిలో దెబ్బతిన్నా... మరొకడికి టైం ఇవ్వలేకపోయా... కాజల్

కాజల్ అగర్వాల్ తన చెల్లెల్లి పెళ్లి చేస్కున్నప్పటికీ ఆమె మాత్రం ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు కనిపించడంలేదు. ప్రేమలో ఏమయినా ఫెయిలైందా అనే అనుమానం వచ్చినవారికి అది నిజమేనని తేలింది. విషయం ఏంటంటే

Advertiesment
kajal agarwal
, బుధవారం, 4 అక్టోబరు 2017 (14:09 IST)
కాజల్ అగర్వాల్ తన చెల్లెల్లి పెళ్లి చేస్కున్నప్పటికీ ఆమె మాత్రం ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లు కనిపించడంలేదు. ప్రేమలో ఏమయినా ఫెయిలైందా అనే అనుమానం వచ్చినవారికి అది నిజమేనని తేలింది. విషయం ఏంటంటే... గతంలో, అంటే సినిమాల్లోకి రాకముందు ఒక వ్యక్తి వల్ల గట్టి ఎదురుదెబ్బ తిన్నదట. ఆ తర్వాత అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సక్సెస్ సాధించడం జరిగిపోయాయి. 
 
ఆ తర్వాత కూడా, సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని ఇష్టపడిందట. ఐతే అతడికి కావల్సినంత సమయం కేటాయించకపోవడంతో అపార్థం చోటుచేసుకుని అది కూడా కట్ అయిపోయిందట. అప్పుడు తెలిసిందట... ఏదయినా బంధం దృఢంగా వుండాలంటే అవతలి వ్యక్తికి కావలసినంత సమయం కేటాయించాలని. ప్రస్తుతం అంత టైమ్ కేటాయించే స్థితిలో తను లేనని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు... గతంలో తను ఎప్పుడైనా ఏడ్చిన సంఘటన ఏదైనా వున్నదా అంటే... ఓ అబ్బాయి విషయంలోనే అలా ఏడ్చానని చెపుతోంది. ప్రేమ విఫలమైతే అంతే కదా ఎవరికైనా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీసాలు తీసేసింది గర్ల్స్ లైక్ చేస్తారనేనట... నాగార్జున కామెంట్