Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరం : ప్రధాని మోడీ

Webdunia
శనివారం, 16 జులై 2022 (19:14 IST)
ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ రీజియన్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిని శనివారం ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో చిత్రకూట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్‌ పరుగులు పెడుతుందన్నారు.
 
సీఎం యోగి ఆదిత్యనాథ్ ​నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమేకాకుండా, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ఇదంతా డబుల్‌ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
 
కాగా, 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments