Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM modi
, గురువారం, 14 జులై 2022 (13:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 296 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేని ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ రోడ్డును చిత్రకూట్ - ఇటావా ప్రాంతాల మధ్య నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు నిర్ణీత కాల వ్యవధి కంటే ఎనిమిది నెలలకు ముందే పూర్తి చేశారు. 
 
ఈ రోడ్డు నిర్మాణ పనులు గత 2020 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, ఈ ప్రాజెక్టు 'వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలతో సామాన్య ప్రజలను అనుసంధానం చేస్తుందని ప్రకటించారు. 
 
కాగా, ఈ రహదారి చిత్రకూట్ జిల్లాలోని భరత్ కూప్ నుంచి ప్రారంభమై ఇటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామంలో ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేతో అనుసంధానమవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే చిత్రకూట, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔర్రయ్యా, ఇటావా అనే ఏడు జిల్లాలను అనుసంధానం చేస్తూ నిర్మించారు. 
 
ఈ రహదారి మార్గంలో బాగెన్, కెన్, శ్యామా, చందావాలా, బిర్మా, యమునా, బెత్వా, సెంగర్ అనే నదులు ఉన్నాయి. ఈ నదులపై వంతెనలు నిర్మించారు. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన నాలుగు లేన్‌ల ఎక్స్‌ప్రెస్‌వే భవిష్యత్తులో ఆరు లేన్‌లకు విస్తరించే అవకాశం ఉంది. దీనికి 13 ఇంటర్‌చేంజ్ పాయింట్లు ఉన్నాయి.
 
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా దాదాపు రూ.1,132 కోట్లు ఆదా చేసింది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో కనెక్టివిటీకి ఒక పూరకాన్ని ఇస్తుందని మరియు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి రుణం తీరుస్తాం.. విజయ్ మాల్యా కుమార్తెలు