Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (11:43 IST)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలోని ఓ పునరావాస కేంద్రంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ రోగి పట్ల ముగ్గురు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. దొడ్డు కర్రతో వారిని చితకబాదారు. తమ కసితీరా కొట్టిన తర్వాత రోగిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇది నెట్టింట వైరల్ అయింది. 
 
ఈ వీడియోలోని ఫుటేజీ ప్రకారం... రోగిని ఓ గదిలో బంధించి దారుణంగా కర్రతో కొడుతున్నారు. తనను కొట్ట వద్దని ఎంత వేడుకున్నా ఏమాత్రం కనికరించకుండా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ వ్యక్తిని పదేపదే కొడుతూ ఈడ్చుకుంటూ వెళ్లడం, ఆ వెంటనే మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కాళ్లు చేతులు పట్టుకోవడం, ఆ తర్వాత మరో వ్యక్తి కర్రతో చితకబాదడం చూడొచ్చు. ఈ వీడియోను సూచిన నెటిజన్లు రోగి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, ఈ ఘటన బెంగుళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలమంగళ గ్రామీణ పోలీస్ స్టేషన్ పిధిలోని ఓ ప్రైవేట్ పునరావాస కేంద్రంలో జరిగినట్టు సమాచారం. ఈ ఘటన తాజాగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. పునరావాస కేంద్రం నిర్వాహకులపై సుమోటాగా కేసు నమోదు చేశారు. వార్డెన్ దుస్తులు, బాత్రూమ్‌లు శుభ్రం చేయాలని చెప్పగా ఆ రోగి నిరాకరించడంతో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వార్డెన్ ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments