Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

Advertiesment
donald trump

ఠాగూర్

, మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (09:18 IST)
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, జనవరి 20వ తేదీన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయగా, అవి పెను సంచలనం సృష్టించాయి. ఇపుడు ఆయన మళ్లీ సంచలన ఆదేశాలు జారీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన ఆయన 1807 నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేసే దిశగా ఆదేశాలు జారీచేయనున్నట్టు సమాచారం.
 
జనవరి 20వ తేదీన ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులోని నిబంధన ప్రకారం ఈ ప్రకటన తేదీ నుంచి 90 రోజుల్లోపు అమెరికా దక్షిణ సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితులు నేపథ్యంలో పూర్తి కార్యాచరణ నియంత్రణను పొందేందుకు అక్కడ 1807 తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయాలా వద్దా అనే దానిపై రక్షణ శాఖ, హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అధ్యక్షుడుకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 
 
1807 తిరుగుబాటు చట్టం ప్రకారం ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మిలిటరీని, యూఎస్ నేషనల్ గార్డ్‌ను మొహరించే అధికారం అధ్యక్షుడుకి ఉంటుంది. పౌరులు ఏదైనా తిరుగుబాటు చేసినా, హింసకు పాల్పడినా లేదంటే ఏదైనా ప్రతిఘటన చర్యను పూర్తిగా అణచివేసేందుకు సైన్యానికి ఈ చట్టం సంపూర్ణ అధికారం ఇస్తుంది. సాయుధ దళాల కమాండర్, చీఫ్‌కు అమెరికాలో దళాలను ఎపుడు మొహరించాలో నిర్ణయించే పూర్తి అధికారాలను అధ్యక్షుడుకి ఇస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం